swarnandhra 2047: అభివృద్ధి కాదు..అంతకు మించి 2047 విజన్ డాక్యుమెంట్ 9 d ago
ఏపీ: స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ అంటే కేవలం అభివృద్ధి మాత్రమే కాదని అంతకు మించి రాష్ట్రాన్ని ముందు తరాలకు స్ఫూర్తిగా, అన్ని రంగాల్లో బలోపేతంగా, ఆశాజనక కేంద్రంగా తీర్చిద్దడమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ విజన్ డాక్యుమెంట్ ఈనాటికి మాత్రమే పరిమితం కాదని తెలుగు ప్రజల రేపటి రోజును ఉజ్వలంగా, సుస్థిరంగా, ప్రతి ఒక్కరి ఆకాంక్షలను, అవసరాలను తీర్చేలా రూపుదిద్దడమని పేర్కొంది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడి ఆలోచనలకు అనుగుణంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అత్యున్నత శిఖరంపై నిలబెట్టేలా...ఆయన దూరదృష్టికి నిలుటద్ధంగా.. ఒక దార్శనిక పత్రం విజన్ డాక్యుమెంట్ రూపొందించారు.
స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్‌ను సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. సంపన్నమైన, ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన ఆంధ్ర అనేది ఉపశీర్షిక. 10 సూత్రాలతో దీనిని రూపొందించారు. విజయవాడ ఇందిరగాంధీ స్టేడియంలో డాక్యుమెంట్‌ను జాతికి, తెలుగు ప్రజలకు అంకితం చేస్తున్నట్లు మొదటి ఎడిషన్‌లో సీఎం సంతకం చేయగా..మంత్రులు లోకేష్, పవన్ కల్యాణ్, సత్యకుమార్, అధికారులు కింద సతకాలు చేశారు. విజన్ డాక్యమెంట్‌లోని ముఖ్యమైన అంశాలను..రాబోయే తరాలకు సీఎం చంద్రబాబు ఎలాంటి పరిపాలన అందించబోతున్నారో.. తన 20 ఏళ్ల భవిష్యత్తు పరిపాలన ఎలా ఉంటుందో.. ఇందులో వివరించారు..అందులో ముఖ్యంగా...
సమసమాజం: గొప్ప సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్. ఆధునికతను, నూతనత్వాన్ని అందింపుచ్చుకుంటూ.. సరికొత్త ఆవిష్కరణలతో, ఉన్నత ఆకాంక్షలతో... స్వర్ణశకం వైపు అడుగులేస్తోన్న ఒక ప్రగతి పూర్వక రాష్ట్రం. ఆనందం, అభివృద్ధి, బాధ్యతతో కూడిన తెలుగు ప్రజలు..అన్ని వర్గాల అభివృద్ధి సాధించే సమ సమాజం.
నాలెడ్జ్ హబ్: వినూత్న ఆలోచన కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో నాలెడ్జ్ హబ్స్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదం ముందుకెళ్తున్న పారిశ్రామిక ఆకర్షణ కేంధ్రం తీర్చిదిద్దడం.
ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు: స్వర్ణాంధ్రకు ప్రజలే కీలకం. అందుకే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆకాంక్షలను నెరవేర్చేలా, ప్రపంచలోనే నాణ్యమైన విద్య అందుబాటులో ఉంచి, ఉత్తమమైన ఆరోగ్య సంరక్షణ, ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు లభించే రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం.
నైపుణ్యాభివృద్ధి: పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు, జీవితకాలం కొనసాగే నిరంతర ప్రక్రియ, సమగ్ర ఆరోగ్య సంరక్షణతో ప్రతి పౌరుడు విజేతగా నిలిచేలా..ఒక ఆదర్శ సమాజాన్నినిర్మించడం.
ప్రగతిదాయక సమాజం: గ్రామాలు మొదలుకుని పట్టణాలు, నగరాలకు వరకు అన్ని వర్గాల వారికి అవసరమైన వనరులను, అవకాశాలను అందించి ప్రగతి దాయక సమాజాన్ని నిర్మించడం.
ప్రజలకు జీవన భద్రత: ప్రజలందరికీ జీవన భద్రతతో పాటు అన్ని విధాల అభివృద్ధిని అందుకునేలా గ్రామాలను బ్లాకులుగా, పట్టణాలను ప్రపంచ స్థాయి అర్బన్ కేంద్రాలుగా..అభివృద్ధి చేయడం.
లాభసాటిగా వ్యవసాయం: వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా రంగాలను లాభసాటిగా మార్చడానికి, మరింతగా రైతులకు సంక్షేమాన్ని అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆయా రంగాల్లో ఉత్పత్తి పెంచడానికి వివిధ రకాల పంటల సాగును ప్రోత్సహించడం, ఎక్కవ దిగుబడి ఇచ్చే పద్దతులను అమలపర్చడం.
సుస్థిర పర్యావరణం: సహజ వారసత్వ సంపదకు, ఉన్నతమైన సంస్కృతికి కేంద్రం ఆంధ్రప్రదేశ్. ఈ విశిష్ఠతను ప్రపంచానికి పరిచయం చేసేలా ప్రపంచ పర్యాటక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చి దిద్దడం. రేపటి తరాలకు ఆరోగ్యకరమైన, సుస్థిరమైన పర్యావరణాన్ని అందించేందుకు కర్బన ఉద్గారాలు తగ్గించి, గ్రీన్ టెక్నాలజీని ప్రోత్సహించడం. సేంద్రియ వ్యవసాయ పద్దతులను అనుసరించడం, కాలుష్య రహిత నగరాలను తీర్చిదిద్దడం వంటి పర్యావరణ హిత విధానాలను ప్రభుత్వం అమలు చేస్తుంది.
అన్నింటికంటే ముఖ్యమైనది గుడ్ అండ్ రియల్ టైమ్ గవర్నెన్స్..మంచి, వేగవంతమైన పరిపాలన. ప్రజల అభిప్రాయలను తెలుసుకోవడం, గౌరవించడం, ప్రజా సమస్యలు ఎవైనా సరే త్వరగా స్పందించడం, త్వరితంగా సేవలందించడం, ప్రతి వ్యవస్థను పారదర్శకంగా, అత్యాధునికంగా తీర్చిదిద్దడం తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. స్వర్ణ శకానికి ఇది ఆరంభమని విజన్ డాక్యుమెంట్‌పై వివరణిచ్చారు.